Omicron New Medicine

                     ఆనందయ్య  ఓమిక్రాన్  మందు




      ఆనందయ్య అనే వ్యక్తి కరోనా సమయంలో బాగా ప్రసిద్ది చెందాడు. ఆయన పూర్తి వివరాలు లోకి వెళ్లినట్లయెతే ఇతను ఒక మారుమూల గ్రామానికి చెందిన వాడు నెలూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణ పట్నంలో జన్మించాడు .

                                    ఇతను వ్యవసాయం మరియు వ్యాపారవేత అలాగే రాజకీయనాయకుడు మరియు ఆయుర్వేదం.ఇలా ఆనందయ్య తన జీవితాన్ని సార్థకం చేసాడు.ఈయనకు నలుగురు తమ్ముళ్లు అలాగే నలుగురు చెల్లెళ్లు.

         ఆనందయ్య కరోనా ఆయుర్వేద మందు

 నెల్లూరూ జిల్లాకు చెందిన కృష్ణపట్నం గ్రామానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య తయారుచేసిన ఔషథం. ఈ మందు కరోనా వ్యాధిని తగ్గించడానికి ఉపయోగపడుతుందని ప్రజలు భావిస్తున్నారు. అతను కరోనా వ్యాధి నిర్మూలన కొరకు వివిధ రకాల మందులను తయారుచేసాడు. ఆ మందులలో కొన్ని కరోనా పొజిటివ్ వచ్చే రోగులకు, మరికొన్ని కరోనా వ్యాధి సోకకుండా ఉండేందుకు ప్రజలకు ఉచితంగా అందిస్తున్నాడు. కరోనా వ్యాధిని కట్టడి చేస్తున్నట్లు భావిస్తున్న ఈ మందును తయారుచేసిన ఆనంద్ కుటుంబం ఆయుర్వేద ఔషధాలను తయారుచేసే నేపథ్యం ఉంది. అతను డిగ్రీ వరకు చదువుకున్నాడు. అతనికి చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికతపై మక్కువ ఎక్కువ ఉండటం వల్ల వెంకటయ్య స్వామి శిష్యుడు గురవయ్య స్వామి దగ్గర శిష్యరికం కూడా చేశాడు. ఆ సమయంలో ఆయుర్వేద మందులపై పట్టు సాధించాడు. ఆయుర్వేదంలో తనకున్న అనుభవంతో కరోనాను కట్టడి చేసే మందును తయారు చేసి ముందుగా కృష్ణపట్నం గ్రామ ప్రజలకు ముందుగా అందించాడు. 

మందు తయారీ:

ఈ ఆయుర్వేదం మందు తయారీలో ఉపయోగిస్తున్నవి తిప్పతీగ,లవంగాలు, వేపాకు,మామిడి చిగురు, నేరేడు ఆకు, పిప్పింటాకు, బుడబుడసాకు,తాటిబెల్లం, పట్ట, తేనె, నేల ఉసిరి, కొండ పల్లేరుకాయలు, జాజికాయ వంటివి వాడుతున్నారు

మందు పంపిణీ:సవరించు

ఈ మందు 5 రకాల మందులను పంపిణీ చేస్తున్నాడు.కరోనా రాకుండా రోగనిరోధక శక్తి పెంచడానికి ఒక మందు, క‌రోనా వచ్చిన నాలుగు రకాల మందులను పంపిణీ చేస్తున్నాడు.కరోనా రాకుండా ‘పీ’ రకం మందును, కోవిడ్‌ వచ్చిన వారికి పీ, ఎఫ్, ఎల్, కే రకాలను ఇస్తున్నారు.

  •  ఈ మందు కరోనా ఉన్నవారు, లేనివారు వాడవచ్చు. ఈ మందులో తెల్ల జిల్లేడు, నేరేడు ఇగురు, వేప ఇగురు,మారేడు ఇగురు, దేవర్‌ దంగిలే, నల్ల జీలకర్ర, పట్టా, పసుపు, తోక మిరియాలు, పచ్చ కర్పూరం, ఫిరంగి చెక్క పొడి వంటివి వాడుతున్నారు.
  • ఎల్‌ మందు: ఈ మందు పాజిటివ్‌ ఉన్న వారికే ఇస్తునారు. ఈ మందులో నేల ఉసిరి, గుంట గలగర ఆకులు ఒక బకెట్, మిరియాలు, నల్లజీలకర్ర, పట్టా, పసుపు, పిప్పళ్ల చెక్క, జాజికాయ, తేనె వంటివి వాడుతున్నారు.
  • ఎఫ్‌: ఈ మందు పాజిటివ్‌ ఉన్న వారికే ఇస్తునారు.ఈ మందులో పుప్పింటి ఆకు,నల్ల జీలకర్ర, పసుపు,మిరియాలు, పసుపు, పిప్పళ్లు, జాజికాయ, తేనెలను ఆన్నింటిని కలిపి చూర్ణంగా ఇస్తున్నారు.
  • కే: ఈ మందు పాజిటివ్‌ ఉన్న వారికే ఇస్తునారు.ఇందులో పెద్ద పల్లేరు కాయలు మిరియాలు, పసుపు, పిప్పళ్ల చెక్క,నల్ల జీలకర్ర, పట్టా, జాజికాయ, తేనెలను ఆన్నింటిని కలిపి చూర్ణంగా ఇస్తున్నారు.
  • ఐ:ఆక్సిజన్‌ 95% తగ్గిన వారికి కంటిలో డ్రాప్స్‌ వేస్తున్నారు. తేనె, ముళ్ల వంకాయ గుజ్జు, తోక మిరియాలను వినియోగిస్తారు. పల్స్‌ తీవ్రను బట్టి ఒక్కొక్క కంటిలో ఒక్కొక్క డ్రాప్‌ వేయాలి.
ఆనందయ్య ఒమిక్రాన్ మందుకు ఎదురుదెబ్బలు, ప్రభుత్వం నుంచే.. పంపిణీ సాగేనా?




       గతంలో కరోనా నివారణకు ఆనందయ్య ఇచ్చిన మందుపై కూడా ఇలాగే గందరగోళం చెలరేగింది. చివరకు కోర్టు జోక్యం చేసుకోవడంతో ఆయుష్ శాఖ సహా.. ఇతర అధికారులు దాని నాణ్యతను పరిశీలించారు.


ఒమిక్రాన్ కు మందు రెడీగా ఉందని, 48 గంటల్లో దాన్ని నయం చేస్తానంటూ ప్రకటించిన ఆనందయ్యకు మరోసారి ప్రభుత్వం నుంచి ఎదురుదెబ్బ తగిలింది. ఆనందయ్య సొంత ఊరిలో ఆందోళన మొదలైన మరుసటి రోజే ప్రభుత్వం ఆయనకు నోటీసులు ఇచ్చింది. నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ తరపున ఆనందయ్యకు నోటీసు జారీ చేశారు. ముత్తుకూరు మండల తహశీల్దార్ సోమ్లా నాయక్ ఆనందయ్యకు ఈ నోటీసు అందించారు. డ్రగ్‌ అండ్‌ కాస్మొటిక్‌ యాక్ట్‌ ప్రకారం మందు తయారీ, పంపిణీకి ఆయుష్‌ శాఖ నుంచి అనుమతి ఉందా అంటూ ఈ తాఖీదులో ప్రశ్నించారు. ఒకవేళ అనుమతి ఉంటే కలెక్టరేట్‌ కు వచ్చి వివరణ ఇవ్వాలని సూచించారు. ఆనందయ్య రెండు రోజుల్లో వచ్చి వివరణ ఇస్తానని చెప్పారు.


Comments